Subrahmanyam Jaishankar: అమెరికా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చర్చలు

S Jaishankar Mike Pompeo discuss

  • ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై చర్చ
  • కరోనా, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదంపై మాట్లాడుకున్న నేతలు
  • భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చ
  • శాంతి, సుస్థిరత, భద్రతల కోసం పనిచేస్తామని పునరుద్ఘాటన

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. కరోనా మహమ్మారి, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదం, భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా వారు మాట్లాడుకున్నారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతల కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వారిద్దరు చెప్పారు.

ఇరు దేశాల మధ్య ఉన్న  ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ చర్చలకు ప్రాధాన్యత నెలకొంది.  

భారత సరిహద్దులతో పాటు ఇండో- పసిఫిక్‌ ప్రాదేశిక జలాల విషయంలో చైనా దూకుడు చర్యలను కట్టడి చేసేలా భారత్‌, అమెరికాల మధ్య బంధం మరింత బలపడాలని ఇటీవలే అమెరికా చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారత్‌కు తమ దేశం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News