Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న 65 మంది

chiru birthday special poster going to release
  • ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజు
  • బ‌ర్త్‌డే డీపీని ఆవిష్క‌రించడానికి ప్ర‌య‌త్నాలు
  • అన్ని సినీ పరిశ్రమల నుండి 65 మంది కలిసి విడుదల
  • #ChiruBdayFestBegins ఇప్పటికే ట్రెండ్‌
సినీ హీరో మహేశ్ బాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న నేపథ్యంలో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో నంబర్ వన్ గా నిలిచిన విషయం తెలిసిందే. సినీ హీరోల బర్త్ డేలకు సోషల్ మీడియాలో ఎన్నడూ లేనంతంగా అభిమానులు హడావుడి చేస్తున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉంది. దీంతో ఆయ‌న బ‌ర్త్‌డే డీపీని ఆవిష్క‌రించడానికి ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి.

భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుండి 65 మంది ప్రముఖులు చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. ఇలా విడుదలవుతున్న మోష‌న్ పోస్ట‌ర్ ఇదే అయి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుపుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #ChiruBdayFestBegins అంటూ ఈ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు.
Chiranjeevi
Tollywood
Twitter
Social Media

More Telugu News