Prashat Bhushan: చీఫ్ జస్టిస్ లపై అవితీని ఆరోపణల కేసు.. ప్రశాంత్ భూషణ్ పశ్చాత్తాప ప్రకటనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court refuses to accept regrets of Prashat Bhushan over corrupt CJIs remark

  • 2009లో తెహల్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు
  • సగం మంది సీజేఐలు అవినీతిపరులని ఆరోపణ
  • సీజేఐలు, వారి కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పిన ప్రశాంతి

గతంలో పని చేసిన 16 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఎనిమిది మంది అవినీతిపరులే అంటూ న్యాయవాది, ఉద్యమకారుడు ప్రశాంత్ భూషన్ గతంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 2009లో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన వివరణ, పశ్చాత్తాప ప్రకటనలను నేడు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా? లేదా? అనే కోణంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

2009లో తెహల్కా మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులే అని తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో ఆయనపై సుప్రీంకోర్టులో అప్పుడే ధిక్కరణ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచీ ఈ కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో... తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాని పేర్కొంటూ ప్రశాంత్ భూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు... భావ ప్రకటనా స్వేచ్ఛకు, కోర్టు ధిక్కరణకు స్వల్ప తేడా ఉందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చే సోమవారం ఈ అంశంపై విచారణ జరపనుంది.

  • Loading...

More Telugu News