Woman: క్షణికావేశం ఫలితం... హైదరాబాదులో బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకున్న యువతి
- ఇద్దరూ మృతి
- అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకిన యువతి
- భర్తతో గొడవలే కారణం!
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తన కుమార్తె సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో రామాంతపూర్ లో విషాదం నెలకొంది. ఏడాది పాపతో కలిసి అపార్ట్ మెంట్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. తీవ్రగాయాలతో వారు అక్కడికక్కడే మరణించారు. అభంశుభం తెలియని చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి తన భర్తతో గొడవపడినట్టు భావిస్తున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.