Rakesh: రాకేశ్ చౌదరిని వెంటనే విడుదల చేయాలని డీజీపీకి లేఖ రాశాను: చంద్రబాబు

I wrote a letter to DGP demanding for release of Rakesh says Chandrababu
  • సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా?
  • టీడీపీ వాళ్లు పెట్టకూడదా?
  • పోస్టులు తొలగించనని చెప్పినందుకు రాకేశ్ ను వేరే కేసులో అరెస్ట్ చేశారు
చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్త రాకేశ్ ను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... తనను, టీడీపీ నేత పులివర్తి నానిని విమర్శిస్తూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని... వాటిని ఖండిస్తూ రాకేశ్ చౌదరి అనే టీడీపీ అభిమాని పోస్టులు పెట్టారని చెప్పారు. దీంతో, రాకేశ్ ను స్టేషన్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని... ఇది చాలా దారుణమని అన్నారు.

సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా? టీడీపీ వాళ్లు పెడితే పోలీసులు బెదిరిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోస్టులు తొలగించనని చెప్పినందుకు రాకేశ్ పై కుట్ర చేశారని... వేరే కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాకేశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశానని చెప్పారు.
Rakesh
Chandrababu
Telugudesam
YSRCP
Social Media

More Telugu News