Bay of Bengal: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం: వాతావరణ శాఖ
- ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు
- అనుబంధంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం
- ఏపీ, టీఎస్ కు వర్ష సూచన
వాయవ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్ పై కొనసాగుతున్న అల్పపీడనం బలపడటం, తమిళనాడు తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు, దక్షిణ చత్తీస్ గఢ్ పై మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతోనే సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉంటుందని, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.