India: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
- రూ.1,317 తగ్గిన బంగారం ధర
- ఏకంగా రూ. 2,900కు పైగా తగ్గిన వెండి ధర
- రూపాయి బలపడటమే కారణమన్న నిపుణులు
నిన్న మొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న విలువైన లోహాల ధరలు కొద్దిగా దిగొచ్చాయి. న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 1,317 తగ్గి రూ. 54,763కు చేరుకోగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,943 తగ్గి, రూ. 73,600కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,564 తగ్గి, రూ. 53,951కి, వెండి ధర రూ. 2,397 తగ్గి రూ. 71,211కుచేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశవాళీ మార్కెట్ పైనా పడిందని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా బంగారం ధరలను తగ్గేలా చేశాయని వ్యాఖ్యానించారు.