KTR: బెంగళూరులో హింసపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందన.. నెటిజన్లకు సూచన

KTR dont indulge in propaganda  stop spreading fake news

  • సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ప్రమాదకరం
  • బాధ్యతగా ఉండాలని కోరుతున్నాను
  • ఇటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు
  • రెచ్చగొట్టే చర్యలకు సామాజిక మాధ్యమాలను వాడొద్దు 

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయగా వివాదం రాజుకుని అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 110 మందికి పైగా అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులు ఎంతటి పరిణామాలకు దారి తీస్తాయో తెలిపే ఈ ఘటనకు సంబంధించిన వార్తను పోస్ట్ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటువంటి న్యూస్ ప్రచారం చేయొద్దని సూచించారు.

'సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలుపుతోంది. బాధ్యతగా ఉండాలని సామాజిక మాధ్యమాలను వాడే అందరినీ నేను కోరుతున్నాను. ఇటువంటి ప్రచారాలు చేయొద్దు, నకిలీ వార్తలను ప్రచారం చేయడం ఆపండి. అసాంఘిక చర్యలను రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దు' అని కేటీఆర్ సూచించారు.

  • Loading...

More Telugu News