Laser Weapon: ప్రధాని ప్రసంగం సందర్భంగా లేజర్ ఆయుధాన్ని మోహరించిన రక్షణ శాఖ

Andi drone laser system deployed during PM Modi speech at Redfort

  • ఆకాశంలో ఎగిరే డ్రోన్లను గుర్తించే లేజర్ ఆయుధం
  • డ్రోన్లను కూల్చివేయగల సామర్థ్యం
  • లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేసిన డీఆర్డీవో

ఇవాళ 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ యావత్ భారతావనిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ కోసం సరికొత్త లేజర్ ఆయుధ వ్యవస్థను మోహరించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ యాంటీ డ్రోన్ లేజర్ వ్యవస్థ ప్రధానంగా ఆకాశంలో తిరుగాడే డ్రోన్లను వెంటనే పసిగడుతుంది. అవసరమైతే వాటిని కూల్చివేయగలదు. 3 కిలోమీటర్ల పరిధిలో సూక్ష్మ పరిణామంలో ఉన్న డ్రోన్లను కూడా ఇది నిర్వీర్యం చేయగలదు. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో డ్రోన్ల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈసారి ప్రధాని రక్షణ కోసం ఈ లేజర్ గన్ ను కూడా భద్రతా చర్యల కోసం వినియోగించారు.

  • Loading...

More Telugu News