Vaishno Devi Temple: ఐదు నెలల తర్వాత నేడు తిరిగి తెరుచుకోబోతున్న వైష్ణోదేవి ఆలయం

Vaishno Devi Temple Reopens from today

  • కరోనా నేపథ్యంలో మార్చి 18న ఆలయం మూత
  • తొలి వారంలో రోజుకు 2 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి
  • భక్తులకు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం ఐదు నెలల తర్వాత నేడు తెరుచుకోబోతోంది. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 18న ఆలయాన్ని మూసివేశారు. తాజాగా, నేడు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే, ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫేస్‌మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరని ఆలయ అధికారి రమేశ్ కుమార్ తెలిపారు.

తొలి వారం రోజుకు 2 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. వీరిలో 1900 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు కాగా, మిగతా 100 మంది బయటి రాష్ట్రాల వారు. అలాగే, భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరని రమేశ్ కుమార్ వివరించారు.

  • Loading...

More Telugu News