Digital: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు

Digital payments to be introduced at ward and village secretariats in AP

  • 35 శాఖల్లో 500 సేవలకు యూపీఐ ఆధారిత పేమెంట్
  • 15,000కి పైగా గ్రామ/వార్డు సచివాలయాల్లో అమలు
  • డిజిటల్ ఏపీ కోసం ప్రభుత్వం చర్యలు

ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలకు సంబంధించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 15,000కు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. డిజిటల్ ఏపీ పేరిట తీసుకువస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 35 శాఖలకు సంబంధించిన 500కి పైగా సేవలకు యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఎన్పీసీఐ, కెనరా బ్యాంక్ లతో చేయి కలిపింది.

ఈ విధానం ఎలా అమలవుతుందంటే... ఏదైనా గ్రామ/వార్డు సచివాలయానికి పౌరుడు వెళ్లినప్పుడు అతడు ఏ సేవల నిమిత్తం అక్కడికి వెళ్లాడో ఆ వివరాలను అక్కడి డిజిటల్ అసిస్టెంట్ సంబంధిత పోర్టల్ లో నమోదు చేస్తాడు. అప్పుడు ఆ సేవలకు పౌరుడు ఎంత చెల్లించాలో అంత మొత్తానికి ఓ యూపీఐ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ను సదరు పౌరుడు తన ఫోన్ లోని ఏదైనా యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. ఈ విధానం పూర్తి సురక్షితమని, సులభమని ఏపీ సర్కారు పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News