Devineni Uma: చంద్రబాబు మాటలు వినపడుతున్నాయా జగన్?: దేవినేని ఉమ

devineni slams ycp

  • గ్రామాల్లో విద్యుత్ తీగలను తాకుతున్న గోదావరి ప్రవాహం 
  • అంధకారంలో వందలాది గ్రామాలు
  • శిబిరాలకు వస్తేనే సాయమంటున్న ప్రభుత్వం
  • పిల్లలతో కొండలపైకి ఎక్కి టెంట్లలో ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అయితే, శిబిరాలకు వస్తేనే సాయమని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, దీంతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.

'గ్రామాల్లో విద్యుత్ తీగలను తాకుతున్న గోదావరి ప్రవాహం, అంధకారంలో వందలాది గ్రామాలు, శిబిరాలకు వస్తేనే సాయమంటున్న ప్రభుత్వం, పిల్లలతో కొండలపైకి ఎక్కి టెంట్లలో ప్రజలు. ఏజెన్సీలో ఆకలి కేకలు.  పంట నష్టపోయిన రైతులకు చేయూతనిచ్చి, వరద బాధితులను ఆదుకోవాలంటోన్న చంద్రబాబు నాయుడి మాటలు వినపడుతున్నాయా జగన్?' అని దేవినేని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయానికి సంబంధించిన ఓ వీడియోను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News