New Delhi: కరోనా ఎఫెక్ట్: ఢిల్లీ మెట్రో ఉద్యోగుల వేతనాల్లో భారీ కోతలు

Delhi Metro to Reduce Perks and Allowances of Employees

  • కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు
  • ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర నిర్ణయం
  • అడ్వాన్సులపైనా నిషేధం

కరోనా పంజా దెబ్బ ఇప్పుడు ఢిల్లీ మెట్రోపైనా పడింది. ఉద్యోగుల జీతభత్యాల్లో భారీ కోతలు విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆగస్టు నుంచి ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలలో 50 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్న సంస్థ.. వైద్య చికిత్స, టీఏ, డీఏ వంటి ఇతర సౌకర్యాలు మాత్రం వారికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

అలాగే, మెట్రో ఉద్యోగులకు లభించే అన్ని రకాల అడ్వాన్సులను మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధిస్తున్నట్టు ఢిల్లీ మెట్రో వివరించింది. అయితే, ఇప్పటికే అడ్వాన్సులకు అనుమతి పొందిన వారికి మాత్రం వాటిని అందజేస్తారు. కరోనా వైరస్ కారణంగా మెట్రో సేవలు నిలిచిపోవడంతో సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News