Chiranjeevi: ఇది నేను తీసిన రెండో ఫొటో: చిరంజీవి
- ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరు
- మధ్యాహ్నం పవన్ చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్
- తాజాగా తన తండ్రి ఫొటోను షేర్ చేసిన వైనం
వరుస ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి సందడి చేస్తున్నారు. తాను తీసిన తొలి ఫొటో ఇదేనంటూ ఒక ఫొటోను ఈ మధ్యాహ్నం చిరు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తూ అభిమానులకు చిన్న టెస్ట్ కూడా పెట్టారు. దీనికి కొనసాగింపుగా చిరు మరో ట్వీట్ చేశారు. 'ఎస్.. మీ గెస్ కరెక్ట్. ఆ ఐదుగురిలో మధ్యలో ఉన్న వ్యక్తి నా చిన్న తమ్ముడు పవన్ కల్యాణ్' అని చెప్పారు. అంతేకాదు ఇది నేను తీసిన రెండో ఫొటో అంటూ మరో ఫొటోను ఆయన షేర్ చేశారు. మా నాన్న గారు అంటూ ఫొటో గురించి వివరించారు.