Telangana: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం పేలుళ్లలో నాలుగు టన్నెళ్ల ధ్వంసం

Heavy blast at Srisailam hydroelectric power plant

  • షార్ట్‌సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు
  • దట్టమైన పొగతో నిండిపోయిన రెండు కిలోమీటర్ల సొరంగ మార్గం
  • మంటల్లో చిక్కుకున్న ఆరుగురు కార్మికుల కోసం గాలింపు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో అకస్మాత్తుగా సంభవించిన పేలుళ్లలో నాలుగు టన్నెళ్లు ధ్వంసమయ్యాయి. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 4వ యూనిట్ వద్ద కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆ వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించడంతో ఆరు టన్నెళ్లలో నాలుగు పేలిపోయాయి. పేలుడు సంభవించిన సమయంలో మొత్తం 12 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. భారీ శబ్దాలతోపాటు రెండు కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తిగా పొగతో నిండిపోయింది. పేలుడు శబ్దాలకు వణికిపోయిన కార్మికుల్లో ఆరుగురు వెంటనే బయటకు పరుగులు తీయగా, మిగతా ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయారు. సొరంగంలో కమ్ముకుపోయిన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రులు జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News