Chiranjeevi: ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండవు.. బయటపడతాం: వీడియో విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి

KChiruTweets  gives an update about the new initiative taken up CCC

  • సినీ కార్మికులకు మూడో విడత నిత్యావసర సరుకులు పంపిణీ
  • మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి ఎవ్వరికీ వద్దు
  • గణనాథుడు కరోనా నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నాను

సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారికి సాయం చేసేందుకు  క‌రోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. సినీ ప్ర‌ముఖుల నుంచి విరాళాలు సేకరించి కార్మికులకు సాయం చేస్తున్నారు.

మరోసారి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చిరు చెబుతూ... ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండబోవని అన్నారు. త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు పదివేల మంది సినీ కార్మికులకు  తాము సరుకులు అందిస్తున్నామన్నారు.  

'కరోనా మనకేం రాదులే.. మనకేం కాదులే' అన్న నిర్లక్ష్య ధోరణి ఎవ్వరికీ వద్దని ఆయన చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గణనాథుడు గట్టెక్కించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News