Facebook: ఇక మీకు పాత ఫేస్ బుక్ కనిపించదు!

Facebook says goodbye to classic look
  • ఫేస్ బుక్ కు కొత్త రూపు
  • క్లాసిక్ ఫేస్ బుక్ కు మరికొన్నిరోజుల్లో స్వస్తి
  • కొత్తగా డార్క్ మోడ్ ఫీచర్
సోషల్ నెట్వర్కింగ్ కు సిసలైన అర్థం చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పాత రూపుకు స్వస్తి పలుకుతోంది. కొన్నిరోజుల తర్వాత మీరు ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే పాతదైన క్లాసిక్ లుక్ కనిపించదు. సెప్టెంబరు నుంచి ఫేస్ బుక్ కొత్తగా కనిపించనుంది.

వాస్తవానికి కొన్నినెలల కిందటే న్యూ ఫేస్ బుక్ ఫీచర్ మెనూ లిస్టులో కనిపిస్తోంది. అయితే న్యూ ఫేస్ బుక్ ఇష్టంలేని వాళ్లు క్లాసిక్ లోనే కొనసాగే వెసులుబాటు ఇన్నాళ్లు అందించింది. ఇకమీదట ఆ క్లాసిక్ లుక్ ను నిలిపివేయాలని ఫేస్ బుక్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్ కూడా పూర్తిగా మార్చేసింది, అంతేకాదు, డార్క్ మోడ్ ఫీచర్ ను కూడా ఫేస్ బుక్ తన వినియోగదారులకు అందిస్తోంది.
Facebook
Classic Look
New Facebook
Dark Mode
Social Media

More Telugu News