Nara Lokesh: చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సీఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేశ్

Nara Lokesh writes to CM Jagan to help handloom labour

  • నేతన్నల కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్
  • ప్రతి కార్మికుడికి నేతన్న నేస్తం వర్తింపచేయాలని విజ్ఞప్తి
  • స్టాక్ ను వెంటనే కొనుగోలు చేయాలంటూ వినతి

కరోనా సంక్షోభ సమయంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. కుదేలైన చేనేత రంగాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ఆయన సీఎం ముందుంచారు. సొంత మగ్గం ఉన్నవారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతి నేత కార్మికునికి 'నేతన్న నేస్తం' కింద రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకు రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలని సూచించారు. నేత కార్మికుల వద్ద ఉన్న స్టాక్ ను ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలని లోకేశ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News