C.Kalyan: తెలుగు రాష్ట్రాల సీఎంలు జీవోలు ఇచ్చినా షూటింగులు సాధ్యంకాదు: సి. కల్యాణ్

Tollywood producer C Kalyan comments on Centre guidelines for shootings
  • సినీ షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • మార్గదర్శకాలు జారీ
  • కేంద్రం మార్గదర్శకాలపై స్పందించిన సి.కల్యాణ్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా సినీ, టీవీ షూటింగులు జరుపుకునేందుకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పై ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జీవోలు ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగులు సాధ్యంకాదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కొత్తవేమీ కాదని, అందులో ఎలాంటి బెనిఫిట్స్ లేవని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ రాకుండా హీరోలు, టెక్నీషియన్లు ముందుకు రారని వ్యాఖ్యానించారు. సినిమా తీసి డబ్బులు పోగొట్టుకోవడానికి నిర్మాతలు రెడీగా లేరని సి.కల్యాణ్ స్పష్టం చేశారు.
C.Kalyan
Shootings
Guidelines
Corona Virus
Tollywood

More Telugu News