Vijay Devarakonda: 'అర్జున్ రెడ్డి' కాంబినేషన్లో మరో ప్రాజక్టు!

Another project in Arjun Reddy combination
  • మూడేళ్ల క్రితం అర్జున్ రెడ్డి సంచలనం 
  • విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన సినిమా
  • సందీప్ రెడ్డితో వెబ్ సీరీస్ నిర్మిస్తున్న విజయ్ 
  • ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్
మూడేళ్ల క్రితం వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం తెలుగులో ఓ సంచలనం. కథపరంగా.. సంభాషణల పరంగా.. హీరో క్యారెక్టరైజేషన్ పరంగా అదొక కొత్త పంథాలో నడుస్తుంది. అందుకే యువతకు బాగా ఎక్కేసింది. దాంతో భారీ విజయాన్ని సాధించింది. ఆ చిత్రంతోనే హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఇక ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టాడు.

ఇప్పుడు మళ్లీ విజయ్, సందీప్ కలుస్తున్నారు. అయితే, ఇది సినిమా కాదు.. ఇందులో విజయ్ నటించడమూ లేదు. 'కింగ్ ఆఫ్ ద హిల్' బ్యానర్ పై విజయ్ దేవరకొండ నిర్మించే వెబ్ సీరీస్ కి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఇందులో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ పోషిస్తాడట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Vijay Devarakonda
Sandeep Reddy Vanga
Arjun Reddy
Anand Devarakonda

More Telugu News