Unlock 4: మరో వారంలో అన్ లాక్ 4.0... స్కూళ్లు మాత్రం ఇప్పట్లో లేనట్టే!

No Schools Opening in Next Unlock Phase

  • వారంలో ముగియనున్న మూడో దశ అన్ లాక్
  • స్కూళ్లు తెరిచే ఆలోచన లేదన్న ఆరోగ్య శాఖ
  • తొలుత మెట్రోలు, సినిమాలకు మాత్రం అనుమతి

అన్ లాక్ మూడవ దశ మరో వారంలో ముగుస్తుంది. ఆపై ప్రారంభమయ్యే నాలుగో దశలో సినిమా హాల్స్ ప్రారంభించేందుకు అనుమతి లభిస్తుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలను తిరిగి తెరుస్తామని కూడా ప్రకటనలు వచ్చేశాయి. అయితే, అన్ లాక్ 4.0లో స్కూళ్లు ప్రారంభించే అవకాశాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా, చివరి అన్ లాక్ లో మాత్రమే పాఠశాలలు ఉంటాయని, దానికన్నా ముందుగా తెరచుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు.

కాగా, సెప్టెంబర్ 1 నుంచి సినిమాహాల్స్ తో పాటు, వివిధ నగరాల్లో మెట్రో రైళ్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కంటైన్ మెంట్ జోన్లలో ఆంక్షలు మాత్రం అమలవుతూ ఉంటాయని స్పష్టం చేస్తున్న ఉన్నతాధికారులు, ఆ తరువాతి దశలో రైళ్ల పునరుద్ధరణ ఉంటుందని, అప్పటికి కేసుల పెరుగుదల, ఈలోగా జరిగే నీట్, జేఈఈ పరీక్షలను పరిశీలించిన తరువాతనే పాఠశాలలపై నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News