SP Balasubrahmanyam: ఎస్పీ బాలుకు ఫిజియోథెరపీ... కోలుకుంటున్నారన్న తనయుడు

SP Balasubrahmanyam on recovery path from corona
  • బాలుకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
  • తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న చరణ్
  • అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో సందేశం
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్నిరోజుల కిందట ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ వివరాలు తెలిపారు.

తన తండ్రి క్రమంగా కోలుకుంటున్నారని, ఇవాళ ఆయనకు ఫిజియోథెరపీ కూడా నిర్వహించారని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంతకుమించి శుభవార్త అంటూ ఏమీలేదని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశంలో తెలిపారు. మున్ముందు మరిన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పారు.

SP Balasubrahmanyam
Corona Virus
ICU
SP Charan
MGM Hospital
Chennai

More Telugu News