Minor: ఎంపీ సంతోష్ పేరిట ఫేక్ ఫేస్ బుక్ ఐడీతో మోసాలకు పాల్పడున్న మైనర్ బాలుడి అరెస్ట్

Minor duped as MP and ask money with fake id in Facebook
  • నకిలీ ఐడీతో యూపీ బాలుడి మోసాలు
  • డబ్బు కావాలంటూ మాదాపూర్ యువకుడికి సందేశం
  • అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు
సోషల్ మీడియాలో మోసాలకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పేరును ఉపయోగించుకుంటున్న ఓ మైనర్ బాలుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలుడిది ఉత్తరప్రదేశ్. ఇటీవలే ఆ బాలుడు హైదరాబాద్ మాదాపూర్ కు చెందిన యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపాడు.

 ఆపై తనకు డబ్బు కావాలంటూ మెసేజ్ పంపడంతో పాటు  ఫోన్ ద్వారానూ మాట్లాడాడు. దాంతో ఆ యువకుడికి అనుమానం వచ్చింది. ఓ ఎంపీ అయ్యుండి తనను డబ్బు అడగడం ఏంటని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ మోసగాడి బండారం బట్టబయలైంది. సైబరాబాద్ పోలీసులు కేసు విచారించగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలుడని తేలింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గతంలో ఏమైనా మోసాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Minor
Fake ID
Facebook
Santhosh Kumar
TRS
MP
Police

More Telugu News