Corona Virus: ఇలాంటి వారికి కరోనా టెస్టులు అవసరం లేదు: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినా లక్షణాలు లేకపోతే టెస్టులు అనవసరం
- లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలి
- లేని పక్షంలో ఐసొలేషన్ లో ఉండాలి
కరోనా టెస్టులపై ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి లక్షణాలు లేకపోతే... అలాంటి వారికి కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'ద సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' తన వెబ్ సైట్ లో తాజా మార్గదర్శకాలను పొందుపరిచింది. అంతేకాదు మరో కీలక సూచన చేసింది. కరోనా సోకిన వ్యక్తికి 6 అడుగుల లోపు దూరంలో కనీసం 15 నిమిషాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని తెలిపింది.
అంతేకాదు మరో హెచ్చరికను కూడా జారీ చేసింది. టెస్టుల్లో నెగెటివ్ రాగానే కరోనా రాలేదని భావించవద్దని... తర్వాతి రోజుల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపింది. లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. టెస్టులు చేయించుకోని వారు 15 రోజులు ఐసొలేషన్ లో ఉండాలని తెలిపింది.