Sensex: బ్యాంకింగ్ అండతో దూసుకుపోయిన సెన్సెక్స్
- 354 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 88 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 8 శాతానికి పైగా లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాకుల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఈ ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడి 39,467కి పెరిగింది. నిఫ్టీ 88 పాయింట్లు పుంజుకుని 11,648 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (8.43%), యాక్సిస్ బ్యాంక్ (7.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.41%), సన్ ఫార్మా (4.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.22%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.24%), ఇన్ఫోసిస్ (-1.22%), ఎన్టీపీసీ (-1.02%), ఏసియన్ పెయింట్స్ (-0.98%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.97%).