padma awards: వచ్చే నెల 15 వరకు ‘పద్మ’ పురస్కారాల దరఖాస్తు గడువు పెంపు
- 1954లో ప్రారంభమైన పద్మ పురస్కారాల ప్రదానం
- వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తున్న ప్రభుత్వం
- నామినేషన్లు, ప్రతిపాదనల స్వీకరణ గడువు పెంపు
పద్మ పౌర పురస్కారాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్ నామినేషన్లు / ప్రతిపాదనల ప్రక్రియ ఈ ఏడాది మే ఒకటో తేదీన ప్రారంభం కాగా, దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల 15 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 8,035 దరఖాస్తులు రాగా 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు పద్మ పురస్కారాలను ప్రదానం చేసి ప్రభుత్వం గౌరవిస్తోంది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాల ప్రదానం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఈ పురస్కారాల కోసం నామినేషన్లు, ప్రతిపాదనలను https://padmaawards.gov.in.కు పంపవచ్చు.