Sushant Singh Rajput: హీరో సుశాంత్ కేసులో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి.. ఈ 2 ప్ర‌శ్న‌లకు మాత్రం చెప్పని రియా

rhea not given answers for 2 questions cbi probe on sushant case
  • సుశాంత్‌తో విడిపోయిన తర్వాత ఇంటినుంచి వెళ్లిపోయారా
  • ఎందుకు విడిపోవాల్సి వచ్చింది?
  • అనంతరం కూడా రియా సోద‌రుడికి సుశాంత్ ఫోన్ చేశాడా?
  • అన్న ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పని రియా
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పలు ప్రశ్నలకు రియా నుంచి సమాధానం రాబట్టిన అధికారులు రెండు ముఖ్య‌మైన‌ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆమె నోటి నుంచి వివరాలు రాబట్టలేకపోతున్నారు.

ఆ రెండు ప్రశ్నలు అడిగిన సమయంలో ఆమె వాటిని దాట‌వేసే ధోరణితో వ్యవహరించింది. రియాను అధికారులు మొత్తం 50 ప్ర‌శ్న‌లు అడిగితే అందులో ఈ రెండింటికి మాత్రం ఆమె స‌రైన స‌మాధానాలు ఇవ్వలేద‌ని సమాచారం. ఈ ఏడాది జూన్ 8న సుశాంత్‌తో విడిపోయిన అనంతరం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారా..  ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనంతరం కూడా రియా సోద‌రుడికి సుశాంత్ ఫోన్ చేశాడా.. ఆత్మహత్య చేసుకునే ముందు సుశాంత్‌ గురించి వివరాలు తెలుసుకున్నారా? అన్న ప్రశ్నలకు రియా సరిగ్గా సమాధానం చెప్పట్లేదని తెలిసింది. ఆమె నుంచి మరిన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టే నిమిత్తం ఆమెకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.
Sushant Singh Rajput
Bollywood
CBI

More Telugu News