Telangana: మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. సిటీ బస్సుల విషయంలో సందిగ్ధత!

Telangana govt in dilemma about city bus service resume

  • మెట్రో రైలు సర్వీసుల పునరుద్ధరిణ 
  • ఆర్టీసీ విషయంలో ఉన్నతాధికారులకు అందని ఆదేశాలు
  • సిటీ బస్సుల విషయంలో మరికొంత కాలం వేచి చూడాలని యోచన

లాక్‌డౌన్-4లో భాగంగా పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం మెట్రో రైలు విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సిటీ బస్సుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత రాత్రి వరకు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అదేశాలు అందలేదు.

మెట్రో రైళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులకు కూడా అనుమతి ఇస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు. తామైతే బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మెట్రో రైళ్లలో అయితే ప్రయాణికులను నియంత్రించడంతోపాటు భౌతికదూరం వంటి నిబంధనలను పాటించేందుకు అవకాశం ఉంటుందని, కానీ, సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రభుత్వం.. సిటీ బస్సుల విషయంలో మరికొంతకాలం వేచి చూడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News