Mask: మాస్కు ధరించడంపై కేంద్రం నూతన మార్గదర్శకాలు ఇవే!
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు
- సింగిల్ డ్రైవింగ్ లో మాస్కు అవసరంలేదన్న కేంద్రం
- సైక్లింగ్ చేసేటప్పుడు కూడా మాస్కుతో పనిలేదని వెల్లడి
కరోనా మహమ్మారి బారినుంచి తప్పించుకునే క్రమంలో మాస్కు ప్రధాన అయుధం అని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి అని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం మాస్కు ధరించడంపై కీలక మార్గదర్శకాలు వెల్లడించింది. సింగిల్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు మాస్కు అవసరంలేదని స్పష్టం చేసింది. అయితే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది ఉన్నప్పుడు, జిమ్ లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం మాస్కు వేసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.