Crime News: ప్రేమించిన అబ్బాయిపై యాసిడ్‌ దాడి చేసిన కర్నూలు అమ్మాయి!

girl attacks with acid

  • ప్రేమించిన యువకుడు మోసం చేశాడన్న ఆగ్రహం
  • మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ దాడి
  • వారం రోజుల్లో రెండో సారి యాసిడ్‌ పోసిన అమ్మాయి

ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడన్న ఆగ్రహంతో యాసిడ్‌ దాడి చేసిందో అమ్మాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో చోటుచేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకోకుండా, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ నాగేంద్ర అనే యువకుడిపై ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్‌ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News