Subramanian Swamy: సొంతపార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swamy gets anger on BJP IT Cell
  • బీజేపీ ఐటీ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది 
  • ఫేక్ ఐడీలతో తనను ట్రోల్ చేస్తున్నట్టు వెల్లడి
  • ప్రతిదాడులకు తాను బాధ్యత వహించబోనన్న స్వామి
సొంతపార్టీ కార్యకర్తలే తనను ట్రోల్ చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీజేపీ ఐటీ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఐటీ విభాగంలోని కొందరు నాపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు. అందుకోసం ఫేక్ ఐడీలు సృష్టించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. "ఈ వ్యాఖ్యలతో నా ఫాలోవర్లు ఎవరైనా ఆగ్రహంచి బీజేపీపై ప్రతిదాడులు చేస్తే అందుకు నేను బాధ్యత వహించలేను. ఎందుకంటే బీజేపీ కూడా ఇలాగే చెబుతుంది కాబట్టి. తన ఐటీ విభాగం కార్యకలాపాలకు బీజేపీ ఎలా బాధ్యత వహించలేనని చెబుతుందో నేనూ అంతే!" అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Subramanian Swamy
IT Cell
BJP
Rogue
Social Media

More Telugu News