Malaika Arora: ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలా?: మండిపడ్డ అమృత అరోరా

Amruta Arora fires on netizens for sharing MalaikasCorona report
  • అర్జున్, మలైకాలకు కరోనా
  • సోషల్ మీడియాలో షేర్ అవుతున్న మలైకా రిపోర్ట్
  • ఈ మనుషులకు ఏమైందన్న అమృత అరోరా
బాలీవుడ్ ప్రేమ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇద్దరికీ కరోనా సోకిన సంగతి తెలిసిందే. తమకు కరోనా సోకినట్టు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు మలైకా అరోరా మెడికల్ రిపోర్టు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై ఆమె సోదరి, సినీ నటి అమృత అరోరా మండిపడింది.

తన సోదరి మెడికల్ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏముందని ప్రశ్నించింది. కరోనా నుంచి కోలుకునేందుకు ఆమె తనను తాను సిద్ధం చేసుకుంటోందని తెలిపింది. మలైకాకు కరోనా రావడం సబబేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని... ఇది అత్యంత దారుణమని మండిపడింది. ఇలాంటి సమయంలో ఇలా చేయడమేమిటని ప్రశ్నించింది. ఈ మనుషులకేమైందని మండిపడింది.
Malaika Arora
Amrita Arora
Bollywood
Corona Virus

More Telugu News