Bengaluru: దేశంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్‌ను మూసేస్తున్న కర్ణాటక

Bengaluru Covid centre will be closed

  • లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న వారి కోసం ఏర్పాటు
  • 10 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద కొవిడ్ కేంద్రం
  • హోం ఐసోలేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోనే ఈ నిర్ణయం

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 10 వేల పడకలతో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద కొవిడ్ కేంద్రాన్ని మూసివేసేందుకు బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సమాయత్తమవుతోంది. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు నగరంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులకు హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ కేంద్రంలో చేరే రోగుల సంఖ్య పడిపోయింది.

ఈ నేపథ్యంలో దీనిని మూసివేయాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఈ నెల 15న సెంటర్‌ను మూసివేయనున్నారు. కొవిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, పడకలు, డస్ట్‌బిన్లు తదితర వాటిని ప్రభుత్వ వసతి గృహాలు, ఆసుపత్రులకు ఉచితంగా అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News