China: చైనా ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం విఫలం
- వివరాలు తెలిపిన చైనా మీడియా
- జిక్యువాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగం
- కారణాలను విశ్లేషిస్తోన్న శాస్త్రవేత్తలు
జిక్యువాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి చైనా తాజాగా ప్రయోగించిన ఓ ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. తమ దేశం చేపట్టిన ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైందని డ్రాగన్ దేశ మీడియా తెలిపింది. ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడం వెనుక ఉన్న కారణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికీ స్పష్టత రాలేదు.
ఉపగ్రహం పనితీరులో లోపాలున్నట్లు వారు భావిస్తున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిన్న మధ్యాహ్నం చేపట్టినట్లు చైనా మీడియా వివరించింది. క్వాయ్‌జావ్-1ఏ రాకెట్‌పై ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేయగా, అందులోకి ఉపగ్రహం చేరుకోలేకపోయిందని తెలిపింది. ఉపగ్రహం విఫలం కావడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.