Jagan: చినజీయర్ స్వామిని ఫోన్ లో పరామర్శించిన సీఎం జగన్
- చినజీయర్ తల్లి మంగతాయారు కన్నుమూత
- చినజీయర్ కు ప్రముఖుల పరామర్శలు
- ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం జగన్
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శివైక్యం చెందడం తెలిసిందే. మాతృవియోగం పొందిన చినజీయర్ స్వామికి ప్రముఖుల నుంచి పరామర్శలు అందుతున్నాయి. ఈ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ క్రమంలో సీఎం జగన్ సైతం చినజీయర్ స్వామికి ఫోన్ చేశారు. చినజీయర్ తల్లి మరణించడం పట్ల పరామర్శించారు. చినజీయర్ కు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
తల్లి మంగతాయారు అంటే ఎంతో అభిమానం చూపే చినజీయర్ ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. తల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారానికి లోనయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంగతాయారు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఇటీవలే గుంటూరు వచ్చి వెళ్లిన మంగతాయారు హైదరాబాదులోని కుమార్తె నివాసంలో ఉండగా శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ మండలం శ్రీరామనగరం ఆశ్రమంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.