Devineni Uma: ఈ టెండర్లన్నీ దక్కించుకున్న ఆ ముగ్గురు ఎవరో చెప్పండి?: దేవినేని ఉమ

devineni uma slams jagan

  • టెండర్లన్నీ ఆ ముగ్గురికేనా?
  • సీమలో ఎన్డీబీ పనుల పందేరం
  • సొంతపార్టీ నేతలకే 793 కోట్ల రూపాయల పనులు
  • ఎవరికి కట్టబెట్టాలో ముందే నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు

టెండర్లన్నీ ఆ ముగ్గురికేనా? పేరిట ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'సీమలో ఎన్డీబీ పనుల పందేరం.. సొంతపార్టీ నేతలకే 793 కోట్ల రూపాయల పనులు, పోటీ టెండర్లు సొంత వారివే, ఏ టెండర్ ఎవరికి కట్టబెట్టాలో ముందే నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు.. ముందుగా తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారమే టెండర్లు దాఖలు. రిజర్వు టెండరింగ్ లో టెండర్లన్నీ దక్కించుకున్న ఆ ముగ్గురుఎవరు? చెప్పండి వైఎస్ జగన్ గారు' అని ఆయన ప్రశ్నించారు.

కాగా, న్యూడెవలప్ మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సాయంతో ఏపీలో రూ.6,400 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం, అభివృద్ధికి రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నారు.  తొలి దశలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని రహదారి పనులకు టెండర్లు పిలిచారని, ఈ నెల 11తో టెక్నికల్‌ బిడ్లకు గడువు ముగిసిందని అందులో తెలిపారు. అయితే, రూ.378.73 కోట్ల విలువైన పనులు ఓ మంత్రి ఖాతాలో పడనున్నట్లు సమాచారం అందినట్లు అంధ్రజ్యోతిలో పేర్కొన్నారు. ఓ ప్రభుత్వ పెద్ద బంధువుకు రూ.228 కోట్ల పనులను చేజిక్కించుకున్నట్లు తెలిపింది. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు రూ.187 కోట్ల పనులు కట్టబెట్టనున్నట్లు తెలిసిందంటూ ఆంధ్రజ్యోతి పేర్కొంది.

  • Loading...

More Telugu News