Sensex: అమ్మకాల ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Sensex ends 97 points lower

  • 97 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 24 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 10 శాతానికి పైగా లాభపడ్డ హెచ్సీఎల్ టెక్నాలజీస్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎనర్జీ, ఫార్మా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 38,756కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11,440కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (10.08%), టీసీఎస్ (4.69%), టెక్ మహీంద్రా (3.09%), ఇన్ఫోసిస్ (3.06%), టైటాన్ కంపెనీ (1.62%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.79%), బజాజ్ ఫైనాన్స్ (2.99%), పవర్ గ్రిడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.20%), సన్ ఫార్మా (2.12%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.10%).

  • Loading...

More Telugu News