rajnath singh: చైనా తీరుపై రాజ్యసభలో రాజ్‌నాథ్‌ సింగ్ కీలక ప్రకటన

rajnath singh  talks about stand off with china

  • చైనా మాటలు ఒకలా, చేతలు మరోలా ఉన్నాయి
  • ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాం
  • చైనా చర్యలకు సమాధానం చెబుతున్నాం

చైనా మాటలు ఒకలా, చేతలు మరోలా ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై  రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు.  చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చైనా చర్యలకు భారత సాయుధ బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చాయని చెప్పారు. ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లంఘిస్తుందని తెలిపారు.

1988 తర్వాత భారత్‌, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. 1962లో చైనా 38వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ నుంచి 5,000 చదరపు కిలోమీటర్ల భూమిని కూడా తీసుకొందని అన్నారు.

  • Loading...

More Telugu News