Andhra Pradesh: సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన వాతావరణ శాఖ!

IMD Warning For Telugu States

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
  • అకస్మాత్తుగా వర్షం కురుస్తుందన్న అధికారులు

నేటి సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

మరో 36 గంటల వ్యవధిలో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, కొన్ని చోట్ల మరింత వర్షం పడుతుందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం నెలకొని వుందని, ఇదే సమయంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింతగా బలపడి వాయవ్య దిశగా సాగుతుందని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు కమ్ముకొస్తాయని, పర్యవసానంగా భారీ వర్షం పడుతుందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు, కోస్తాంధ్రకు ముప్పు అధికమని అన్నారు.

  • Loading...

More Telugu News