Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే!
- 65 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 21 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 8 శాతానికి పైగా పతనమైన భారతి ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. చైనాతో సరిహద్దుల వద్ద సమస్య, పెరుగుతున్న కరోనా కేసుల భయాలతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65 పాయింట్లు నష్టపోయి 37,668కి పడిపోయింది. నిప్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,131 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.36%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.28%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.24%), నెస్లే ఇండియా (1.23%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.21%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిల్ టెల్ (-8.09%), టాటా స్టీల్ (-3.53%), ఎన్టీపీసీ (-2.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.73%), టీసీఎస్ (-2.40%).