SP Balasubrahmanyam: ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు... ఆర్ధరాత్రి 12 గంటలకు మరో బులెటిన్

Latest health bulletin of SP Balasubrahmanyam will be released at midnight
  • బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
  • ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసిన ఆసుపత్రి వర్గాలు
  • ఆసుపత్రికి వెళ్లిన కమలహాసన్
  • బాలుకు నిన్న జ్వరం..!
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన ఆరోగ్యంపై ఈ సాయంత్రం నుంచి మీడియాలో తీవ్రస్థాయిలో వార్తలు వస్తున్నాయి. చెన్నై ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ లో బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ ను అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నారు.

కాగా, బాలు పరిస్థితి తెలుసుకునేందుకు ప్రముఖ నటుడు కమలహాసన్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోందని తెలిపారు. కాగా, బాలుకు ఇటీవలే కరోనా నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనకు వెంటిలేటర్, ఎక్మో కొనసాగించారు. నిన్న జ్వరం రావడంతో ఆయన పరిస్థితి క్షీణించినట్టు తెలుస్తోంది.
SP Balasubrahmanyam
Health Bulletin
MGM Hospital
Chennai
Corona Virus

More Telugu News