Corona Virus: దేశంలో 58 లక్షలు దాటిన కరోనా కేసులు

 COVID19 case tally crosses 58 lakh mark with a spike of 86052 new cases

  • గత 24 గంటల్లో దేశంలో 86,052 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571
  • మృతుల సంఖ్య మొత్తం 92,290
  • కోలుకున్న వారు 47,56,165 మంది  

దేశంలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 86,052 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,141 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 92,290కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 47,56,165 మంది కోలుకున్నారు. 9,70,116 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
                  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,89,28,440 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 14,92,409 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News