Sensex: నిన్నటి నష్టాల నుంచి మళ్లీ లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు
- 95 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 25 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా నష్టపోయిన భారతి ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుని లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 38,068కి పెరిగింది. నిప్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.84%), టైటాన్ కంపెనీ (2.83%), నెస్లే ఇండియా (1.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.68%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.57%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.34%), టాటా స్టీల్ (-2.77%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.77%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%), సన్ ఫార్మా (-1.01%).