MS Dhoni: అఘోరి కథతో వెబ్ సిరీస్ ను నిర్మించనున్న ధోనీ
- సొంత ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పిన ధోనీ
- థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్టు తెలిపిన సాక్షి
- సినిమా కంటే అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్య
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టాడు. 'ధోనీ ఎంటర్ టైన్మెంట్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పాడు. ఈ సంస్థ ద్వారా గత ఏడాది ఒక డాక్యుమెంటరీని నిర్మించాడు.
తాజాగా ఓ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నాడు. థ్రిల్లింగ్ అడ్వెంచర్ గా ఆ వెబ్ సిరీస్ ఉంటుందని ధోనీ భార్య సాక్షి తెలిపారు. ఇంకా ప్రచురితం కాని ఓ పుస్తకం ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. రహస్యంగా ఉన్న ఓ అఘోరి తన ప్రయాణాన్ని సాగించిన తీరు ఈ సిరీస్ లో ఉంటుందని తెలిపారు. ఆ అఘోరి వెల్లడించే రహస్యాలు మన నమ్మకాలను మార్చేస్తాయని చెప్పారు. సినిమా కంటే ఈ సిరీస్ అద్భుతంగా ఉంటుందని అన్నారు.