Allu Studios: మా కుటుంబం మొత్తానికి సినిమాయే ప్రాణం: అల్లు ఫ్యామిలీ

Allu family inaugurates Allu Studios on Allu Ramalingaiah birth anniversary

  • నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతి
  • హైదరాబాదులో అల్లు స్టూడియోస్ కు శ్రీకారం
  • ప్రకటన చేసిన అల్లు కుటుంబం

సుప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు వారి ఫ్యామిలీ ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోస్ పేరిట భారీ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు అల్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి సినిమా అంటే ప్రాణమని, తమకు ఆనందాన్నిచ్చేది సినిమానే అని స్పష్టం చేశారు.  

అల్లు రామలింగయ్య ఘనవారసత్వాన్ని కొనసాగించేందుకు తమకు సినిమానే మార్గమని ఈ ప్రకటనలో వివరించారు. అల్లు స్టూడియోస్ ను ఆయన జ్ఞాపకార్థం అంకితమిస్తున్నామని ప్రకటించారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామని తెలిపారు.

హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టూడియో రూపుదిద్దుకోనుంది. అత్యాధునిక సౌకర్యాలతో సినీ, టెలివిజన్ చిత్రీకరణకు అనువుగా ఉండేలా ఈ స్టూడియో నిర్మానం ఉండనుంది .

  • Loading...

More Telugu News