KL Rahul: కేఎల్ రాహుల్ రాణించినా... చివర్లో చెన్నై బౌలర్లది పైచేయి!
- దుబాయ్ లో చెన్నై వర్సెస్ పంజాబ్
- మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 రన్స్
దుబాయ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 63 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ 26, మన్ దీప్ సింగ్ 27, నికోలాస్ పూరన్ 33 పరుగులు నమోదు చేశారు.
ఓ దశలో పంజాబ్ స్కోరు 200 దాటేలా అనిపించినా, చెన్నై బౌలర్లు సమయోచితంగా రాణించి పరుగుల పోరుకు కళ్లెం వేశారు. 18వ ఓవర్లో కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో పంజాబ్ భారీ స్కోరు ఆశలకు అడ్డుకట్ట పడింది.
చెన్నై కెప్టెన్ ధోనీ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఫీల్డింగ్ సెట్ చేసి పంజాబ్ పరుగుల ప్రవాహాన్ని నియంత్రించాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా చెరో వికెట్ తీశారు.