Rhea Chakraborty: బైకుల్లా జైలు నుంచి బయటికి వచ్చిన రియా చక్రవర్తి!

Rhea Chakraborty released from prison after a month
  • సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం
  • రియా సహా 15 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ
  • నెల రోజుల జైలు జీవితం తర్వాత రియాకు బెయిల్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు కాగా, కొద్దిసేపటి క్రితమే ఆమె ముంబయిలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే అనేక పర్యాయాలు రియా బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికాగా, తాజాగా బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో నెలరోజుల తర్వాత ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చినట్టయింది. దీనిపై ఆమె న్యాయవాది స్పందిస్తూ, నెలరోజులు జైలు జీవితం గడిపిన రియా ఇప్పుడు హాయిగా నిద్రిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.

సుశాంత్ మృతి వెనుక డ్రగ్స్ కోణం ఉందన్న నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని పలుమార్లు విచారణకు పిలిపించిన ఎన్సీబీ అధికారులు ఆపై ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ కేసులో ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా మరో 13 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే షోవిక్ కు బెయిల్ లభించలేదు.
Rhea Chakraborty
Release
Byculla Jail
Bail
Bombay High Court
NCB
Sushant Singh Rajput

More Telugu News