Ashwani Kumar: తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీ కుమార్

Former CBI director Ashwani Kumar commits suicide

  • అశ్వనీ కుమార్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ అధికారి
  • కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో అశ్వనీ కుమార్
  • గతంలో గవర్నర్ గానూ పనిచేసిన వైనం

సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. అశ్వనీ కుమార్ వయసు 69 సంవత్సరాలు. అశ్వనీ కుమార్ మృతిని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా నిర్ధారించారు.

అశ్వనీ కుమార్ 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆయన రెండేళ్ల పాటు అదే రాష్ట్రానికి డీజీపీగా ఉన్నారు. 2008 నుంచి 2010 వరకు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాదు, ఆయన నాగాలాండ్, మణిపూర్ కు గవర్నర్ గానూ వ్యవహరించారు. ప్రస్తుతం సిమ్లాలో ఉంటున్న అశ్వనీ కుమార్ కొంతకాలంగా డిప్రెషన్ కు లోనయ్యారని, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News