Prabhas: ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా... బిగ్ సర్ ప్రయిజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్!

Vaijayanthi Movies Announce that Amitab is also part of Prabhas and Deepika Movie
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బహుభాషా చిత్రం
  • అమితాబ్ కూడా భాగమయ్యారని ప్రకటన
  • ట్విట్టర్ లో వెల్లడించిన వైజయంతీ మూవీస్
బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ హీరోగా, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ ఓ చిత్రాన్ని తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించనుందని కూడా అధికారిక ప్రకటన వెలువడింది. ఇక, ఈ ఉదయం 10 గంటల సమయంలో వైజయంతీ మూవీస్, తన ట్విట్టర్ ఖాతాలో బిగ్ సర్ ప్రయిజ్ ను ఇచ్చింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్, ఇండియా గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్, తమ చిత్రంలో నటించనున్నారని ప్రకటించింది. ఆయన చేరికతో, తమ ప్రయాణం మరింత విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Prabhas
Nag Ashwin
Vaijayanthi Movies
Deepika Padukone
Amitabh Bachchan
Ashwani dutt

More Telugu News