TS High Court: టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎలా తెలుస్తాయి?: తెలంగాణ హైకోర్టు

Intentionally you are reducing corona deaths number says TS HC

  • కరోనా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు
  • తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారు  
  • వెంటిలేటర్ల గురించి కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదు

తెలంగాణలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపుతున్నారని మండిపడింది.

ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన వెద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తగ్గిందని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ... టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎన్నున్నాయో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదని చెప్పింది. తప్పుడు లెక్కలతో హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.

  • Loading...

More Telugu News